ప్రేమించి మోసం చేసిన ప్రియుడి ఇంటిముందు ప్రియురాలు బయటయించిన ఘటన ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో చోటు చేసుకుంది. గత మూడు సంవత్సరాలుగా ప్రియుడు రఘు ప్రేమించి ఇప్పుడు మోసం చేస్తున్నాడని పట్టణంలో ని సంగం బస్తి కి చెందిన ప్రియురాలు పద్మ ఆరోపిస్తోంది. ఈ విషయం పై పోలీసులకు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని అందుకే ప్రియుడి ఇంటి ముందు బంధువుల తో కలిసి నిరసన చేస్తున్నట్లు ప్రియురాలు పద్మ తెలిపింది. అయితే నిన్న రాత్రి నుంచి ప్రియుడు రఘు ఇంటి ముందు ప్రియురాలు తన బంధువుల తో కలిసి నిరసన తెలపడంతో ప్రియుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయి పద్మ తో తమకు ఎలాంటి సంబంధం లేదని తమపై అనవసర ఆరోపణలు చేస్తుందని ఫిర్యాదు లో పేర్కొన్నారు.