నెల్లూరు జిల్లాలోని మహిళా ఎస్ఐ, కానిస్టేబుల్ మధ్య ప్రేమాయణం ఇప్పుడు జిల్లా పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కానిస్టేబుల్ భార్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటం, ఎస్ఐ కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి భార్యను బెదిరిస్తూ గొడవ చేయటం సంచలనంగా మారింది.
నెల్లూరు జిల్లాలోని పోలీస్ శాఖలో ఆత్మకూరు డివిజన్ లో ని ఓ పోలీస్ స్టేషన్ లో మహిళ ఎస్ఐగా పని చేస్తోంది. అదే పోలీస్ స్టేషన్ లో పని చేసిన కానిస్టేబుల్ మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ వ్యవహారం కాస్త ఆ కానిస్టేబుల్ భార్యకు తెలియడంతో భర్తని నిలదీసింది. ప్రవర్తన మార్చుకోవాలని కోరింది. ఎంతకూ మార్పు రాకపోవడంతో జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. వారి సూచనల మేరకు ఇటీవల ఆ కానిస్టేబుల్ భార్య కలువాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దాంతో ఈ కేసును విచారించాలని ఎస్పీ భాస్కర్ భూషణ్ ఏఎస్పీని ఆదేసించారు. ఈ విషయం తెలుసుకున్న మహిళా ఎస్ఐ తనపై ఫిర్యాదు చేస్తావా అంటూ కానిస్టేబుల్ ఇంటి వద్ద రచ్చ చేసింది.
దీంతో ఈ విషయాన్ని కూడా కానిస్టేబుల్ భార్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చింది. దీంతో ఎస్ఐ పరారీలో ఉన్నారు.