నిషిద్ధ ప్రదేశాలలో అసాంఘిక కార్యకలాపాలు సాగించడం అనేది తప్పు మాత్రమే కాదు, నేరం కూడా. రైలులో పొగతాగడం అనేది నేరం. గంజాయి తాగితే ఘోరం. అదీ మహిళలు తాగితే…మగవాళ్ళు కాస్త ఎక్కవ సమానమని నమ్మే ప్రస్తుత సమాజానికి అంతకు మించి.! ఆడమగ అని తేడాలేదు. తప్పు ఎవరు చేసినా తప్పే కదా.!?
కొందరు మహిళలు రైలులో సిగరెట్లు కాల్చారు అంతేకాదు గంజాయి పీల్చారు. దీనిని సహించలేక పోయిన ఒక ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేశాడు. ఆ తర్వాత రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు.
పశ్చిమ బెంగాల్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి టాటానగర్ నుంచి కతిహార్ వెళ్లే రైలులో ప్రయాణించాడు. అయితే అసన్‌సోల్ రైల్వే స్టేషన్‌లో కొందరు వ్యక్తులు ఆ రైలు ఎక్కారు. ఆ బృందంలోని మహిళలు సిగరెట్లు కాల్చడంతోపాటు గంజాయి పీల్చారు.అంతేకాదు రాత్రంతా దానిని కొనసాగించారు.
కాగా, ఆ రైలులో ప్రయాణించిన ఒక వ్యక్తి ఆ మహిళలు కాల్చిన సిగరెట్లు, గంజాయి వాసనతో పాటు, వారి చర్యలను భరించలేకపోయాడు. తన మొబైల్ ఫోన్‌లో రహస్యంగా రికార్డ్ చేశాడు. తర్వాత ఆ వీడియో క్లిప్‌ను రైల్వే శాఖకు పంపి దీని గురించి ఫిర్యాదు చేశాడు.
‘టాటానగర్ నుంచి కతిహార్ వెళ్లే రైలులో అసన్‌సోల్ స్టేషన్‌లో ఎక్కిన మహిళలు రాత్రంతా ‘గంజాయి, సిగరెట్లు’ తాగారు’ అని ట్విట్టర్ ద్వారా రైల్వేకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు రైల్వే శాఖకు చెందిన రైల్వే సేవా విభాగం దీనిపై స్పందించింది.
‘సర్, దయచేసి ప్రయాణ వివరాలు (పీఎన్‌ఆర్/ట్రైన్ నంబర్) మొబైల్ నంబర్‌ను డీఎం ద్వారా షేర్ చేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. మీరు నేరుగా http://railmadad.indianrailways.gov.in లో మీ ఆందోళనను తెలియజేయవచ్చు.
లేదా సత్వర పరిష్కారం కోసం 139కి డయల్ చేయవచ్చు’ అని రైల్వే సేవా విభాగం ట్వీట్ చేసింది. అయితే ఆ ప్రయాణికుడు ఆ వివరాలు పంపాడా?, ఆ మహిళలపై రైల్వే పోలీసులు చర్యలు తీసుకున్నారా? అన్నది తెలియలేదు.
కాగా, ఆ ప్రయాణికుడు షేర్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు భిన్నంగా స్పందించారు. మహిళలు రైలులో సిగరెట్లు, గంజాయి తాగడాన్ని కొందరు విమర్శించారు.
@AshwiniVaishnaw
इन लड़कियों ने रात भर गांजा और सीक्रेट करें पिया है 😡
Yah log Asansol mein chadhi thi Tata Katihar train mein pic.twitter.com/vo5YwI3DIf— Parmanand kumar Saw (@Parmana93518260) February 27, 2023