ప్రజాసంఘాల నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని, కనీసం కోర్టులో కూడా హజరుపర్చటం లేదంటూ చైతన్య మహిళా సంఘం అధ్యక్షురాలు అనిత హై కోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ చేసిన వారిని కోర్టులో హజరుపర్చకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు… రేపు ఉదయం చీఫ్ జస్టిస్ ముందు హజరు పర్చాలని పోలీసులను ఆదేశించింది.
ప్రజా సంఘాల నేతలు స్వప్న, దేవేంద్ర, సందీప్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. దీంతో చైతన్య మహిళా సంఘం హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్‌ను దాఖలు చేసింది.