హైదరాబాద్ లో రాష్ట్ర గవర్నర్ తమిళిసైని కొందరు మహిళలు అడ్డుకునే యత్నం చేశారు. నగరంలోని కూకట్పల్లి జేఎన్టీయూ స్నాతకోత్సవానికి హాజరైన గవర్నర్.. తిరిగి వెళ్తుండగా మహిళలు కాన్వాయ్ కు అడ్డుతిరిగే ప్రయత్నం చేశారు.
దీంతో మహిళలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఓ మహిళకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేయడానికి వచ్చినా బాధితులను ఎవరూ పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మహిళగా అర్ధం చేసుకుంటారని వస్తే.. కలవకపోవడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేకుండా పోయిందని అన్నారు.
పీఎస్లో కనీసం ఫిర్యాదు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ వస్తున్నారని తెలుసుకున్న మహిళలు ఆమెకు సమస్యను తెలిపేందుకే యత్నించినట్లు తెలుస్తోంది.