– బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
మిషన్ భగీరథ.. ఇంటింటికీ నీళ్లు అంటూ టీఆర్ఎస్ గొప్పలు చెప్పుకోడమే గానీ.. వాస్తవంగా జరుగుతున్న దానికి చాలా తేడా కనిపిస్తోంది. తాజాగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం పెద్దకోడూర్ గ్రామంలో మంచి నీళ్ళు రావడం లేదని రోడ్డెక్కారు మహిళలు.
సర్పంచ్ కి, అధికారులకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం ఉండడం లేదని మండిపడ్డారు. వారం, పదిహేను రోజులకి ఒకసారి మాత్రమే నీళ్లు ఇస్తున్నారని.. అది కూడా రెండు, మూడు బిందెలకి ఎక్కువ రావడం లేదని వాపోయారు.
నాయకులు ఓట్ల కోసం వచ్చినపుడు ఎన్నో మాటలు చెబుతారని ఓట్ల తెల్లారి తమ బాధలు ఎవరూ పట్టించుకోరని ఫైరయ్యారు. నీళ్లు లేకుండా తాము ఎలా బతకాలని మంత్రి హరీష్ రావును నిలదీశారు.
తమకు నీళ్లు వచ్చేలా చూడాలని పెద్దకోడూర్ గ్రామ మహిళలు కోరారు. రోడ్డుకు అడ్డంగా బిందెలు పెట్టడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
పూర్తి కథనం..