సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలోని మద్యం దుకాణాలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనావాసాల మధ్యలో మద్యం దుకాణాలు నడిపించటం ఏంటంటూ మండిపడుతున్నారు. మద్యం ఫుల్ గా తాగి, రోడ్ల పై సీసాలు పగలగొడుతున్నారని, దాంతో తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మండిపడుతున్నారు. ఉదయం పూట స్కూల్ కి నడిచివెళ్లే పిల్లలకు ఆ గాజుముక్కలు గుచ్చుకుని గాయాలపాలవుతున్నారని, వెంటనే మద్యం షాప్ ను వేరొక ప్రాంతానికి మార్చాలని పలువురు మహిళలు డిమాండ్ చేశారు.