187 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బంగ్లా మొదట తడబడినా.. తర్వాత తేరుకొని అదరగొట్టింది. ఉత్కంఠగా.. సాగిన ఈ మ్యాచ్ లో ముఖ్యంగా టేయిల్ ఎండ్ బ్యాటర్లు బంగ్లా జట్టును గెలుపు తీరాలకు నడిపించారు. 46 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా సాధించింది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి వన్డే లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది.
టాప్ ఆర్డర్ విఫలం కాగా…మిడిల్ ఆర్డర్ లో వచ్చిన కేఎల్ రాహుల్, అర్థ శతకంతో రాణించడంతో భారత్ ఈ మాత్రం స్కోర్ చేయగలిగింది. రోహిత్ శర్మ 27,శ్రేయస్ అయ్యర్ 24, వాషింగ్టన్ సుందర్ 19 పరుగులు చేయగా.. శిఖర్ ధావన్ 7, కోహ్లీ 9 పరుగులు చేసి అందర్ని నిరాశపర్చారు.
ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ మాత్రం రికార్డు సృష్టించాడు. భారత వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆరో ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో ..31 బంతుల్లో 27 పరుగులు చేసిన రోహిత్.. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ పేరును అధిగమించాడు.
కాగా,334 మ్యాచ్ లు ఆడిన అజహరుద్దీన్.. 308 ఇన్నింగ్స్ లో 36.92 సగటుతో 9,378 పరుగులు చేసి రికార్డ్ ను క్రియేట్ చేశాడు. ఇక ఈ రికార్డును..234 మ్యాచ్ లు ఆడి, 227 ఇన్నింగ్స్ తో రోహిత్ శర్మ అధిగమించాడు.