పాకిస్థాన్ పై బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఏదో ఓ రోజు తాలిబన్ల చేతుల్లోకి వెల్లిపోయినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతోంది.
పాకిస్తాన్ ను భయ భ్రాంతులకు గురి చేసేందుకు ఐఎస్ఐఎస్ అవసరం లేదని, అందుకు ఒక తాలిబన్ చాలంటూ ఆమె ట్వీట్ లో పేర్కొన్నారు. ఏదో ఒక రోజు పాకిస్థాన్ ను తాలిబన్లు తమ నియంత్రణలోకి తీసుకున్నా తాను ఆశ్చర్చపోనని ఆమె వెల్లడించారు.
కరాచీలోని పోలీసు కాంపౌండ్ దాడిని గురించి ప్రస్తావిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కరాచీలోని పోలీసు కాంపౌండ్ లోకి పాకిస్తాన్ తెహ్రికే తాలిబన్ కు చెందిన ఉగ్రమూక శుక్రవారం చొరబడింది. కాంపౌండ్ లోని పోలీసులపై కాల్పులు జరిపింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. దీంతో పాటు మరో ఇద్దరు పోలీసులు, ఇద్దరు సామాన్య పౌరులు మరణించారు. మొదట పోలీస్ కాంపౌండ్ పై ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేసినట్టు ఐజీ వెల్లడించారు. పాక్ ప్రీమియర్ లీగ్ ఆడేందుకు వచ్చిన క్రికెటర్లు ఆ పోలీస్ కాంపౌండ్ కు దగ్గరలో బస చేస్తుండటంతో భద్రతను పెంచారు.