సంగారెడ్డిలో తారా ప్రభుత్వ కళాశాల నూతన భవన ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో అప్యాయంగా ముచ్చటించారు. ఈ క్రమంలో మల్లారెడ్డి అభిమాని అయిన ఓ విద్యార్థితో మాట్లాడారు ఆయన. మల్లారెడ్డి ఎందుకు ఇష్టమో చెప్పాలని, ఆయన మాటలను మిమిక్రీ చెప్పారు.
దాంతో సదరు విద్యార్థి నవ్వుతూ.. సిగ్గు పడుతూ.. మంత్రి మల్లారెడ్డిని ఇమిటెడ్ చేసి, అందర్నీ నవ్వించాడు. మల్లారెడ్డి కష్టపడి మంత్రి స్థాయికి ఎదిగారని అందుకే ఆయనంటే ఇష్టమని చెప్పడంతో మంత్రి హరీష్ రావుతో పాటు అక్కడున్న వారందరూ పొట్టచెక్కలయ్యేలా నవ్వారు.
ఇక హరీష్ రావు మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరికీ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదివేందుకు 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తోందని వెల్లడించారు.
గురుకుల లా కాలేజ్ కూడా వచ్చిందన్నారు. ఇన్నోవేషన్ కోసం టీ హబ్, వి హబ్ ఉన్నాయన్నారు. బాగా కష్టపడితే అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో చాలా న్యూస్ వస్తుంటాయని, అందులో మనకు అవసరం ఉన్నవి మాత్రమే తీసుకోవాలని సూచించారు. లక్ష్యం గొప్పగా ఉంటే జీవితంలో ఏం కావాలనుకుంటే అది అవుతామని హితబోధ చేశారు మంత్రి హరీష్ రావు.