మంచినీరు సరఫరా చేసే పెద్ద ట్యాంకులను తరచూ శుభ్రం చేస్తుంటారు కార్మికులు. అయితే.. ఖమ్మంలో మిషన్ భగీరథ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా కార్మికుడు చనిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మంలోని నయాబజార్ లోని వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేసేందుకు ముగ్గురు కార్మికులు దిగారు. ట్యాంక్ లోపల క్లీన్ చేస్తున్న క్రమంలో సందీప్ అనే కార్మికుడు అనుకోకుండా పైప్ లైన్ లోకి జారిపోయాడు.
పైప్ లైన్ పెద్దగా ఉండడంతో ట్యాంక్ పై నుంచి కిందకు జారుకుంటూ వచ్చాడు సందీప్. ఇది గమనించిన తోటి కార్మికులు అధికారులకు సమాచారం అందించారు. సందీప్ ను కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ.. పైప్ లైన్ లో ఊపిరాడక అతను చనిపోయాడు.
సందీప్ ను కాపాడేందుకు క్రేన్ సాయంతో పైప్ లైన్ ను పగులగొట్టారు అధికారులు. సహాయక బృందాలు దాదాపు మూడు గంటలపాటు శ్రమించారు.