నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత పనులు ప్రారంభం అయ్యాయి. సెక్టార్ 93ఏలోని సూపర్ టెక్స్ రెసిడెన్షియల్ టవర్స్ కూల్చివేత పనుల్లో సోమవారం 100 మంది కార్మికులు పాల్గొన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ పనులు జరుగుతున్నాయి.
నొయిడాలోని ఎమిరాల్డ్ కోర్టు ప్రాజెక్ట్‌లో భాగంగా భాగంగా 40 అంతస్తుల ట్విన్ టవర్స్‌ను సూపర్ టెక్ సంస్థ నిర్మించింది. అయితే ఈ ట్విన్ టవర్సర్ ను నిర్మించే సమయంలో నిబంధనలను పాటించలేదంటూ దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.
దీనిపై వాదనలు విన్న సుప్రీం కోర్టు ట్విన్ టవర్స్ ను కూల్చి వేయాలంటూ గతేడాది అగస్టు 31న తీర్పునిచ్చింది. ఆ తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాలను నిర్ణీత సమయంలోగా అమలు పరచాలని ట్విన్ టవర్స్ రియల్టర్, కాంట్రాక్టర్ లను జస్టిస్ డివై చంద్రచూడ్, సూర్యకాంత్ ల నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.
‘ ట్విన్ టవర్స్ గోడలను కూల్చి వేసేందుకు మేము 100 మంది వర్కర్లను నియమించాము. ఈ సందర్భంగా ఏర్పడే శిథిలాలను తొలగించేందుకు వాహనాను సిద్ధం చేశాము. అసవరాన్ని బట్టి దీనికోసం మరి కొంత మంది కార్మికులను నియమిస్తాము. మే 22న మెయిన్ బ్లాస్ట్ చేసేంత వరకు కార్మికులు ఈ గోడల తొలగింపు పనులను కొనసాగిస్తారు ” అని ఎడిఫైస్ ఇంజినీరింగ్ భాగస్వామి ఉత్కార్ష్ మెహతా తెలిపారు.