తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాల పాత్ర చాలా కీలకం. సకల జనుల సమ్మెలో ఉద్యోగుల పోరాటం అద్భుతం.మరి తెలంగాణ కోసం అంతటి పోరాటం చేసిన ఉద్యోగ సంఘాలు అదే ఉద్యమంలో కలిసి నడిచిన ఆర్టీసి కార్మికులు ఆకలితో అలమటిస్తుంటే వీరికి వినప డట్లేదా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.
ముందు సమ్మె ను ప్రతిపక్షాలు నడిపిస్తున్నాయని మాట్లాడి, ఆ తరువాత ప్రజల ఒత్తిడికి సమ్మె కు మద్దతు ఇస్తున్నామని ప్రెస్ మీట్ పెట్టి మమ అనిపించారు.కనీసం ఆర్టీసి పోరాట సభలకు ఉద్యోగ సంఘాల నాయకులు హజరు కాలేదు తొలివెలుగు తో టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల నిరసన సభల్లో పాల్గొంటామని చెప్పారు. కానీ ఏ ఒక్క సమావేశంలో పాల్గొనలేదు .మౌనంగా ఉన్నారు.టీఎన్జీవో అధ్యక్షుడు సమ్మె కు మద్దతు అంటూనే మమ్మల్ని ఆర్టీసి కార్మికులతో పోల్చొద్దు అంటున్నారు.ఎందుకిలా ఉద్యోగ సంఘాలు సైలెంట్ అయ్యాయి.వ్యక్తిగత అవసరాల కోసమా? లేక కెసిఆర్ చెప్పినట్టు వినకపోతే అసలుకే మోసం వస్తుందనే భయమా? ఉద్యోగ నాయకులు మాత్రం సైలెంట్ గా ఉండడమే బెటర్ అంటున్నారు.
ఇక ఉద్యమంలో కీలక పాత్ర పోషించి పదవులు అనుభవించిన మాజీ ఉద్యోగ సంఘాల నాయకులూ కనీసం నోరు కూడా విప్పడం లేదు .మండలి చైర్మన్ గా పనిచేసిన స్వామి గౌడ్ సైలెంట్ అయిపోయారు.ఒక్క మాట కూడా మాట్లాడలేదు.అటు టీఆరెస్ పార్టీలో కూడా యాక్టీవ్ గా లేరు . అయినా కనీసం స్పందన లేదు . శ్రీనివాస్ గౌడ్ మంత్రి గా , దేవి ప్రసాద్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు.ఉద్యమం ద్వారా పదవులు అనుభవించి తెలంగాణ సమాజం ఆందోళనలో , తోటి కార్మికులు ఆకలితో అలమటిస్తుంటే సినిమా చూస్తున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు .
మనదాక వస్తే కానీ సమస్య అర్థం కాదు…రేపు ఇదే పరిస్థితి మీకు వస్తే మీకోసం ఎవరు ముందుకు వస్తారో ఆలోచించుకోవాలని పలువురు చర్చించుకుంటున్నారు .