మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే రైతులకు మంచి లాభాలు వస్తాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి లు పేర్కొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో వానాకాలం సాగు సన్నద్ధతపై నిర్వహించిన వర్క్ షాపులో మంత్రులు పాల్గొన్నారు.
ఈ దేశంలో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ.. రైతులను అభివృద్ధి చేయాలనుకునే ఏకైక సీఎం కేసీఆర్ అని మంత్రులు తెలిపారు. తృణధాన్యాలు, ఉద్యాన పంటలు వేయాలని రైతులకు అవగాహన కల్పించేందుకు సీఎం అధికారులను ఆదేశించారని తెలిపారు.
రాష్ట్రంలో పత్తికి భారీ డిమాండ్ ఉందని.. వీలైనంత ఎక్కువగా సాగు చేయాలని నిరంజన్‌రెడ్డి సూచించారు. తెలంగాణ పత్తి అంటే హాట్ కేక్ లా అమ్ముడు పోతుందని తెలిపారు. తెలంగాణలో గతేడాది 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని వెల్లడించారు. దాదాపు10 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు వ్యూహాత్మక అడుగులు వేయాలని నిరంజన్‌రెడ్డి వివరించారు.
Advertisements
పంటకు ధర నిర్ణయించే స్థితిలో ప్రస్తుతం రైతులు లేరని.. వారు పండించిన పంట ధరను వారే నిర్ణయించుకునే స్థాకి తెలంగాణ రైతులు రావాలని అన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. రాష్ట్రంలో ప్రతీ రైతు ఎకరాకు రూ.లక్ష ఆదాయం పొందాలని కోరుకుంటున్నానన్నారు. నల్గొండ జిల్లాలో 80 శాతం భూములు ఎర్రనేలలు ఉన్నాయని.. అనువైన పంటలతో రైతులు అధిక లాభాలు అందుకోవాలని అన్నారు జగదీశ్ రెడ్డి.