కరోనా మహమ్మారిని నివారించడానికి దేశంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రపంచ బ్యాంక్ భారత దేశానికి 1 బిలియన్ డాలర్ల అంటే 7600 కోట్ల సహాయాన్ని ప్రకటించింది.ప్రపంచ బ్యాంక్ బ్యాంక్ నుండి ఆరోగ్య రంగానికి అతిపెద్ద మద్దతు అని చెప్పొచ్చు.
ఈ ఆర్థిక సహాయం భారత్ లోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది. కరోనా నివారణ, వ్యాధి సోకిన ప్రజలు, టెస్టింగ్ లు, ట్రీట్ మెంట్ అవసరాలను తీరుస్తుంది.ఈ ఆర్థిక సహాయం వ్యాధి తీవ్రతను అడ్డుకుంటుంది. దేశంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది.
ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కోవిడ్-19 నిర్మూలనకు ప్రపంచ బ్యాంక్ నిధులను కేటాయించింది. అటు.. పాకిస్తాన్‌కు 200 మిలియన్ డాలర్లు, ఆఫ్ఘనిస్తాన్‌కు 100 మిలియన్ డాలర్లు, మాల్దీవ్స్‌కు 7.3 మిలియన్ డాలర్లు, శ్రీలంకకు 128.6 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.
ప్రపంచ బ్యాంక్ కరోనా సహాయాన్ని ఆరోగ్యానికి సంబంధించిన అవసరాలు కాకుండా వేరే అవసరాల కోసం ఈ డబ్బును ఉపయోగించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.నాణ్యత విషయంలో రాజీ పడకూడదు.దేశంలో అధ్వాన్నంగా ఉన్న ఆరోగ్య వ్యవస్థను మెరుగు పరచడానికి ఈ ఆర్థిక సహాయాన్ని ఉపయోగించాలని ప్రజలు కోరుతున్నారు.ఇది కేవలం ప్రపంచ బ్యాంక్ మనకు ఇస్తున్న అప్పు మాత్రమే అని గుర్తించి ప్రభుత్వాలు పని చేయాలి.