కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను, ప్రజల ఆర్థిక స్థితిగతులను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ మిగతా వ్యవస్థలకు బడ్జెట్ పక్కనపెట్టి… కరోనాపై పోరుకు తమ బడ్జెట్ అంతా ఖర్చు చేస్తున్నాయి.
ప్రపంచ దేశాలన్నీ తమ పౌరులకు ఓ వైపు కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటిస్తూనే, మరోవైపు ప్రజలకు ఆర్థిక భారం పడకుండా కొంత సహాయాన్ని అందజేసే కార్యక్రమాలకు తెరతీశాయి. ముఖ్యంగా కరోనా వైరస్ అరికట్టేందుకు లాక్ డౌన్ ను నమ్ముకున్న దేశాలన్నీ ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి.
ఏయే దేశాలు ఒక్కో పౌరునిపై ఎంత ఖర్చు చేస్తున్నాయో చూస్తే…
అమెరికా 6వేల డాలర్లు
జర్మనీ 7287 డాలర్లు
బ్రిటన్ 5943డాలర్లు
స్పెయిన్ 4710డాలర్లు
జపాన్ 2215 డాలర్లు
కెనడా 2175 డాలర్లు
యూరోపియన్ యూనియన్ 1601 డాలర్లు
ఫ్రాన్స్ 782 డాలర్లు
సౌత్ కోరియా 761 డాలర్లు
ఆస్ట్రేలియా 692 డాలర్లు
పాకిస్తాన్ 7000రూయాలు
ఇండియా 1200 రూపాయలు.