క్రికెట్ అంటే బ్యాట్స్మెన్ కంటే బౌలర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నా… ప్రేక్షకులను అలరించేది బ్యాట్స్మెన్ కాబట్టి బౌలర్ ని పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయరు. కాని బౌలర్ వద్ద పస లేకపోతే ఏ టీం అయినా సరే ఓటమి ఎదుర్కోవాల్సిందే. ఇక ప్రపంచంలో ఇప్పుడు ఎందరో అత్యుత్తమ బౌలర్ లు ఉన్నారు. అందులో ప్రధానంగా టాప్ 10 బౌలర్ లు ఉన్నారు.
పాట్ కమ్మిన్స్…
ఈ ఆస్ట్రేలియా బౌలర్… అత్యంతవేగంగా నతులు విసరడమే కాకుండా బ్యాట్స్మెన్ ని కంగారు పెట్టడంలో దిట్ట. 164 టెస్ట్ వికెట్ లు తీసాడు. 111 వన్డే వికెట్ లు టి20 లో 37 వికెట్లు తీసాడు.
అన్రిచ్ నార్త్జే….
ఈ సఫారి స్పీడ్ బౌలర్… ఐపిఎల్ లో బాగా ఫేమస్. అత్యంత వేగంగా బంతులు విసరగలడు. గత ఏడాది ఐపిఎల్ లో ఫాస్టెస్ట్ బాల్ వేసాడు.
బూమ్రా…
టీం ఇండియా అమ్ముల పొదిలో ఒక అస్త్రం. అంతర్జాతీయ క్రికెట్ లో ఈ పేరు వింటే చాలు అత్యుత్తమ ఆటగాళ్ళు అయినా కంగారు పడతారు. 83 టెస్ట్ వికెట్ లు, 108 వన్డే వికెట్ లు 59 టి 20 వికెట్లు తీసాడు
జోఫ్రా ఆర్చర్….
ఈ కరేబియన్ బౌలర్ కోసం ఇంగ్లాండ్ తన రూల్స్ మార్చుకుంది. 2019 వరల్డ్ కప్ విన్నర్ ఈ ఆటగాడు. బంతి వేగంగా విసరడంలో దిట్ట. 43 టెస్ట్, 30 వన్డే, 14 టి 20 వికెట్లు తీసాడు.
ట్రెంట్ బౌల్ట్…
ఈ ముంబై ఇండియాన్స్ బౌలర్ న్యూజిలాండ్ తరుపున ఆడుతున్నాడు. 281 టెస్ట్ వికెట్ లు 169 వన్డే, 46 టి 20 వికెట్లు తీసాడు.
కగిసో రాబాడా…
సింపుల్ గా వచ్చి… కళ్ళు భైర్లు కమ్మే బౌలింగ్ చేసే ఈ సఫారి ఆటగాడు అత్యుత్తమ బౌలర్ గా చెప్పాలి. 2020 లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్. 202 టెస్ట్, 117 వన్డే, 31 టి20 వికెట్లు తీసాడు.
కైల్ జమిసన్…
ఈ కివీస్ బౌలర్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్. ప్రత్యర్ధులకు తన పదునైన బౌలింగ్ తో చుక్కలు చూపిస్తాడు. ఇక బ్యాటింగ్ లో కూడా మంచి స్కిల్ ఉన్న బౌలర్.
మార్క్ వుడ్…
ఇతని రనప్ చూసి చాలా మందికి షోయబ్ అక్తర్ గుర్తుకు వస్తూ ఉంటాడు. ఈ ఇంగ్లీష్ బౌలర్ అత్యంత వేగంగా బంతులు విసరడమే కాకుండా కొత్త బంతితో బాగా ఆకట్టుకుంటాడు. 53 టెస్ట్ వికెట్స్, 66 వన్డే, 23 టి 20 వికెట్లు తీసాడు
వాహబ్ రియాజ్…
2015 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా తో సెమి ఫైనల్ మ్యాచ్ లో ఈ బౌలర్ స్పెల్ చూసే ఉంటారు. షేన్ వాట్సన్ తాను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కామెంట్ చేసాడని బౌలింగ్ తో చుక్కలు చూపించి హీరో అయ్యాడు.
జోష్ హాజిల్ వుడ్…
ఈ ఆసిస్ బౌలర్ తన పొడుగుని బౌలింగ్ కి బాగా ఉపయోగించుకుంటాడు. దాదాపు 6. 5 అడుగుల ఎత్తు ఉంటే ఈ బౌలర్ టెస్ట్ జట్టులో ఆసిస్ కి తురుపు ముక్క. మెక్ గ్రాత్ వారసుడుగా చెప్తారు. 212 టెస్ట్ వికెట్ లు తీసాడు.