భారత్లో రెండు కొత్త వేరియంట్ కేసులు నమోదు కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్వో హెచ్చరికాలు జారీచేసింది.ఒమిక్రాన్లో చాలా మ్యుటేషన్లు ఉన్నాయి.పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ఆగ్నేయాసియా ప్రాంతంలో గుర్తించిన రెండు కేసులు ఇవే అని WHO స్పష్టం చేసింది.
ఒమిక్రాన్ సంక్రమణం..రోగనిరోధక శక్తిని ఎదుర్కొనే సామర్థ్యం వంటి అంశాలపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి.ఆ వేరియంట్లను త్వరగా గుర్తించి ప్రపంచానికి తెలియజేసే దేశాలను WHO ప్రశంసిస్తుందని రీజినల్ డైరెక్టర్ డా.పూనం ఖేత్రిపాల్ సింగ్ అన్నారు.