కరోనా నుండి జనాన్ని రక్షించేందుకు మేడ్ ఇన్ ఇండియా టీకాలతో భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ వెల్లడించారు. ప్రపంచదేశాలన్ని ఈ టీకాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియను భారత్ ఎలా నిర్వహిస్తుందని ప్రపంచం అంతా ఎదురుచూస్తుందన్నారు.
కరోనా వైరస్ వచ్చిన మొదట్లో ఇండియా పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, ఇతర పరీక్షల కిట్లను దిగుమతి చేసుకుందని… కానీ ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ తో దేశం స్వయం సమృద్ధి చెందిందన్నారు. భారత్ నుండే ఇప్పుడు ఎగుమతి అవుతున్నాయన్నారు.