స్వచ్ఛమైన గాలి కావాలంటే ఏం చేయాలి… చెట్లను పెంచాలని అందరూ చెప్తారు. కానీ సాధ్య పడకపోతే…? గాలి ఓవైపు పొల్యూట్ అవుతూనే ఉంటే…? దీనికి స్విట్జర్ ల్యాండ్ దేశానికి చెందిన ఓ కంపెనీ, ఐలాండ్ దేశం కలిసి కొత్త ఉపాయం కనిపెట్టాయి. గాలిలో ఉండే కార్భన్ డై ఆక్సైడ్ తోనే అసలు సమస్య కదా… దాన్నే లేకుండా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనకు కార్యరూపం ఇచ్చాయి.
అవును… ఐలాండ్ లో గాలి నుండి కార్భన్ డై ఆక్సైడ్ ను పీల్చుకునే ఓ ప్లాంట్ ను నెలకొల్పారు. ఈ ప్లాంట్ సంవత్సరానికి దాదాపు 4వేల టన్నుల కార్భన్ డై ఆక్సైడ్ ను పీల్చుకొని స్టోర్ చేసుకుంటుంది. అంటే ఓ సంవత్సర కాలంలో 790 కార్లు విడుదల చేసే ఉద్ఘారాలకు ఇది సమానం అన్న మాట.
ఇలా గాలిలో కలిసే CO2ను పీల్చేయటం ద్వారా ప్యూర్ ఎయిర్ ను అందించవచ్చన్న ఆలోచన ఇది. ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.