ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం ఏదంటే ఇప్పటి వరకు మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ గా చెప్పుకునే వాళ్లం…కానీ ఇప్పుడు ఆ రికార్డ్ మారిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం ఇండియాలో ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని అహ్మదాబాద్ శివారు మొటేరాలో కొత్తగా నిర్మించిన స్టేడియం. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ 90,000 సీటింగ్ కెపాసిటీ కలిగి వుండగా..మొటేరా స్టేడియం 1,10,000 లకు పైగా సీటింగ్ కెపాసిటీ కలిగి ఉందని బీసీసీఐ నిర్ధారించింది. స్టేడియం కు సంబంధించిన ఫోటోలను నెట్ లో షేర్ చేసింది.
బీసీసీఐ స్టేడియం ఫోటోస్ ను షేర్ చేసిన వెంటనే లక్షలాది ఫ్యాన్స్ ఈ ఫోటోలను చూశారు. ఈ నెల 24న రెండు రోజుల పాటు భారత పర్యటనకు వచ్చే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ స్టేడియంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ట్రంప్ రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్ల గురించి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని మొటేరా స్టేడియాన్ని పరిశీలించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన భార్య మెలానియి ట్రంప్ లకు స్వాగత కార్యక్రమం ‘నమస్తే ట్రంప్’ మొటేరా స్టేడియంలోనే జరగనుంది.