ఈ ఫోటో చూస్తుంటే ఇదేదో ట్రైన్ లాగా అనిపిస్తోంది కదా.. మరి పట్టాలెక్కడ ఉన్నాయనుకుంటున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది మీరు అనుకున్నట్టు రైలు కాదు.. అదో పెద్ద కారు.
ఈ కారు ఇప్పుడు చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇందులో 75 మంది వరకు కూర్చోవచ్చు. కారులో స్విమ్మింగ్ పూల్, బాత్ టబ్, డైనింగ్ హాల్స్ ఉన్నాయి. వీటితో పాటు దీనిపై ఓ హెలిప్యాడ్ కూడా ఉండటం గమనార్హం.
లియోసిన్ అనే పిలిచే ఈ కారును మొదటగా జే ఓర్ బర్గ్ అనే వ్యక్తి 60 ఫీట్ల పొడవు ఉండేలా రూపొందించాడు. అప్పుడు ప్రపంచంలో అత్యంత పొడవైన కారుగా లియోసిన్ రికార్డు సృష్టించింది. ఆ తర్వాత 100 ఫీట్ల కారును రూపొందించి రికార్డును తిరగరాశారు.
కానీ తర్వాత కాలంలో కారును మెయింటెనెన్స్ చాలా భారంగా మాడంతో న్యూ జెర్సీ వేర్ హౌస్ లో దాన్ని ఉంచారు. దాన్ని మైఖేల్ మానింగ్ అనే వ్యక్తి లీజుకు తీసుకున్నాడు.
లీజు గడువు తీరే నాటికి కారులోని పలు భాగాలు పాడయ్యాయి. దీంతో నిర్వాహకులు దీన్ని ఈబే జాబితాలో పెట్టారు. ఆ తర్వాత దీన్ని మల్లీ మైఖేల్ లీజుకు తీసుకుని దాన్ని మళ్లీ మోడ్రన్ సదుపాయాలతో పునరుద్దరించారు. ఇప్పడు ఆ కారు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తోంది.