చంద్రుడిపై కాలుమోపుతున్నాం అని గర్వంగా చెప్పుకునే భారతదేశంలో, ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా భారతీయులున్నా నేటి సమాజంలో… అభివృద్ది చెందుతున్న దేశాలతో సరిసమానంగా అన్ని రంగాల్లో పోటీపడుతున్న నేటి సమాజంలో భారతదేశం ఒక్కసారి ఉలిక్కిపడే అంశం ఇది. ఎక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది అని తనను తాను ప్రశ్నించుకునే సందర్భం ఇది. దేశమంతా సమైక్యంగా సమాఖ్య స్పూర్తితో…. ఆలోచించి, భావి భారత పౌరులను కాపాడుకునేందుకు నడుంబిగించేందుకు మోగుతున్న ప్రమాద ఘంటికలను సూచించే ఓ సర్వే రిపోర్ట్ ఇది.
దేశంలో ఆకలిచావులు నెలకొంటున్నాయని… ఆకలితో మాడిపోతున్న దేశాల్లో భారత్ ఉందని, పాకిస్తాన్ మినహ ఇతర పొరుగు దేశాలతో పోలిస్తే ఇండియాలోనే ఆకలి చావులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. మొత్తం 119 దేశాలను పరిగణలోకి తీసుకుంటే… భారత్ 103వ స్థానంతో అత్యంత దయనీయ స్థితిలో ఉందని ప్రకటించింది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనే సంస్థ. పోషకహరలోపం, పిల్లల మరణాలు, పిల్లల వృధా,చైల్డ్ స్టంటింగ్ అనే నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సర్వే చేశారు. అత్యంత ఆకలితో అలమటించే 45 దేశాల్లో భారత్ కూడా ఉందని ఆ సంస్థ తేల్చి చెప్పింది.
ఈ ఆకలి చావులు, చిన్నారుల్లో పోషహకహరలోపాన్ని సరిదిద్దేందుకు తక్షణ చర్యలు చేపట్టడంతో పాటు దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకెళ్తేనే భవిష్యత్ లో మెరుగైన స్థానంలో ఉండగలమని సూచించింది. ఇందుకోసం ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున్న తోడ్పాడు అందించాలని కోరింది. వరుసగా 13వ సంవత్సరం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనే సంస్థ ఈ ర్యాంకులను విడుదల చేసింది.