అనుమానం పెనుభూతమైంది. తన భర్తతో స్నేహంగా ఉంటోందని ఓ యువతిపై కక్ష కట్టిన భార్య..ఆ యువతిపై ఘోర చర్యలకు పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకెళితే.. హైదరాబాద్ గచ్చిబౌలి దగ్గరలోని కొండాపూర్ శ్రీరామ్‌నగర్‌లో గాయత్రి, శ్రీకాంత్ దంపతులు నివసిస్తున్నారు. అదే కాలనీలో ఏపీలోని శ్రీకాకుళంకు చెందిన 25 ఏళ్ల యువతి కూడా నివాసముంటోంది. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతోంది.
శ్రీకాంత్ కూడా సివిల్స్‌కు ప్రిపేరవుతున్న క్రమంలో వీరిరువురి మధ్య పరిచయం ఏర్పడింది. అలా వీరు స్నేహితులు అయ్యారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ భర్య గాయత్రి సదరు యువతిని ఇంటికి పిలిచింది. కొద్ది రోజులు బాగానే ఉన్నా..గాయత్రి మనసులో మాత్రం అనుమానం వచ్చింది. అలా అనుమానం రోజురోజుకూ పెరిగి పెనుభూతమైంది.
తన భర్తపైన సదరు యువతి కన్ను పడిందని, తన భర్త సైతం మరో యువతికి ఆకర్షితుడవుతున్నాడన్న సందేహంతో యువతిని ఇబ్బందుల పాలు చేయాలనుకుంది. ఘోరమైన పథకం పన్ని ఈ నెల 26న సదరు యువతిని పిలిచింది గాయత్రి. గాయత్రి ప్లాన్ తెలియక వచ్చిన యువతిపై ప్లాన్ ప్రకారం..రూమ్‌కు తీసుకెళ్లి నలుగురు యువకులతో అత్యాచారం చేయించింది. అదంతా వీడియో రికార్డు చేసి సదరు యువతిని బెదిరించింది. యువతి ప్రైవేటు పార్ట్స్ పైన ఆయుధాలతో గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. గాయత్రితో పాటు నలుగురు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.