పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం సర్కారు వారి పాట. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం అందించారు. సముద్రఖని, సుబ్బరాజు, నదియా, తనికెళ్ల భరణి, వెన్నెలకిషోర్ కీలక పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమా విషయంలో దర్శకుడు పరుశురాం కొన్ని నెగిటివ్ కామెంట్స్ ని ఎదుర్కొంటున్నాడు.
మొదట నిఖిల్ హీరోగా వచ్చిన యువత సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యాడు పరశురామ్. అప్పట్లో ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత రవితేజ, ఆంజనేయులు సినిమా చేశాడు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత నారా రోహిత్ హీరోగా సోలో సినిమా చేశాడు. ఈ చిత్రం ఘనవిజయం సాధించిన తర్వాత వెంటనే సారొచ్చారు సినిమా చేసిన డైరెక్టర్ పరశురామ్.. ఫ్లాప్ ను అందుకున్నాడు. ఈ సినిమాతో పరశురామ్ చాప్టర్ క్లోజ్ అని అందరూ అనుకున్నారు.
టూత్ పిక్ పైన ఉన్న అమరికను గమనించారా? అది ఎందుకో తెలుసా ?
కానీ కొంత గ్యాప్ తీసుకొని అల్లు శిరీష్ హీరోగా శ్రీరస్తు శుభమస్తు సినిమా చేశాడు. ఈ సినిమాతో మళ్లీ పర్వాలేదు అనిపించుకున్నాడు. ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని గీత గోవిందం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయం సాధించి నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో డైరెక్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు తోనే ఛాన్స్ కొట్టాడు. అదే ఈ సర్కారు వారి పాట.
అయితే ఈ సినిమాతో పరశురామ్ పెద్ద హీరోలను డీల్ చేయలేడు అనే విమర్శ వినిపిస్తుంది. పెద్ద హీరోలతో చేసిన సినిమాలు అన్ని కూడా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాయి. రవితేజ, మహేష్ ఇద్దరి సినిమాలు కూడా అంతంతమాత్రంగానే నడిచాయి. కాబట్టి పరశురామ్ చిన్న హీరోలతోనే సినిమాలు ప్లాన్ చేసుకుంటే మంచిదనే మాట వినిపిస్తోంది. మరి చూడాలి పరశురామ్ ఎటు వైపు అడుగులు వేస్తాడో.
ఆర్ఆర్ఆర్ లో రాజమౌళి చేసిన చిన్న తప్పు…. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్