కొన్ని కొన్ని సినిమాలు మిస్ చేసుకున్నందుకు కొందరు హీరోలు బాధ పడుతూ ఉంటారు. అగ్ర హీరోలు అయినా చిన్న హీరోలు అయినా సరే ఇందుకు ఏ మాత్రం మినహాయింపు కాదు అనే మాట వాస్తవం. కెరీర్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చిన అవకాశాలను చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది. కాని కొందరు హీరోలు దాన్ని క్యాష్ చేసుకోవడంలో ఫెయిల్ అయి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు.
అందులో రాజ్ తరుణ్ అనే హీరో ఒకరు ముందు వరుసలో ఉంటారు. ఆయన కెరీర్ మొదట్లో మంచి సినిమాలే చేసినా సరే ఆ తర్వాత మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఒకటి రెండు మంచి సినిమాలు చేసి ఇప్పుడు టాలీవుడ్ లో పెద్దగా కనపడటం లేదు అనే చెప్పాలి. మంచి దర్శకులతో పరిచయాలు ఉన్నా సరే ఆయనకు కలిసి రావడం లేదు. కెరీర్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు శతమానం భవతి సినిమాను దూరం చేసుకున్నాడు ఈ హీరో.
సతీష్ వేగేశ్న ఈ కథను దిల్ రాజుకి చెప్పగా ఆయన రాజ్ తరుణ్ కి సెట్ అవుతుందని చెప్పడంతో దిల్ రాజు ఆలోచించకుండా రాజ్ తరుణ్ కి చెప్పారు. అతను కూడా ఓకే చేసినా తర్వాత ఇద్దరి మధ్య గొడవలు అయి దిల్ రాజు ఆయన్ను పక్కన పెట్టాడు. ఆ తర్వాత సాయి ధరం తేజ్ కి కథ చెప్పగా అతను నో చెప్పాడు. చివరికి శర్వానంద్ కి చెప్పగా ఆయన ఓకే అనేసాడు. సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా చేసి ఉంటే రాజ్ తరుణ్ కి కలిసి వచ్చేది ఏమో.