సీపీఎం నాయకురాలు బృందా కారత్‌కు చేదు అనుభవం ఎదురైంది. రెజ్లర్ల నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన ఆమెను ఊహించన పరిణామం ఎదురైంది. వేదిక నుంచి వెళ్లిపోవాలంటూ ఆమెను రెజ్లర్ బజరంగ్ పూనియా కోరారు. దయచేసి తమ నిరసనను రాజకీయం చేయవద్దంటూ ఆమెను కోరారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై మహిళా రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఆధ్వర్యంలో రెజ్లర్లు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బ్రిజ్ భూషణ్‌తో పాటు పలువురు కోచ్‌లు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆమె ఆరోపించారు.
విషయం తెలుసుకున్న సీపీఎం నాయకురాలు బృందాకారత్ జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. రెజ్లర్ల నిరసనకు మద్దతు తెలిపేందుకు ఆమె వారిద్దరికి వెళ్లారు. నిరసన చేస్తున్న వేదికపైకి ఆమె వెళ్లగా రెజ్లర్ బజరంగ్ పునియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
నిరసన వేదిక నుంచి దిగిపోవాలంటూ ఆమెను కోరారు. అది రెజ్లర్ల నిరసన అని దానికి రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నించ వద్దంటూ సూచించారు. ఆయనతో పాటు పలువురు రెజ్లర్లు కూడా అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ బృందాకారత్ ను కోరారు. దీంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.