సుహాస్ నటించిన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషణ్ ‘. ఈ చిత్రం ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ హీరోయిన్. అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మాతలు.
ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ కథాంశాన్ని వెల్లడించింది. విజయవాడకు చెందిన ఒక మధ్యతరగతి యువకుడు పద్మభూషణ్ గుర్తింపు పొందిన రచయిత కావాలని కలలుకంటాడు. చివరకు అతను తన మొదటి పుస్తకాన్ని ప్రచురిస్తాడు. అది నిరాశపరుస్తుంది.
అందరూ అతన్ని కించపరిచినప్పుడు, టీనా అతనిని గొప్ప రచయితగా గుర్తిస్తుంది. కానీ కథలో ఒక ట్విస్ట్ ఉంది, ఇది ప్రేమ కథకు ట్రబుల్స్ తెస్తుంది. సింపుల్ గా ఇది పద్మభూషణ్ కథ. ఈ ట్రైలర్ ను అడివి శేష్ రిలీజ్ చేశాడు.
కథాంశం, కథనం రిఫ్రెష్‌గా అనిపిస్తుంది. క్యారెక్టరైజేషన్స్ నుండి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ప్రజంట్ చేయడం వరకు.. దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ అద్భుతంగా పనిచేశాడు. సుహాస్ తన పాత్రకు కొత్తదనం తెచ్చాడు. రొమాంటిక్ ట్రాక్ కూడా ఆకట్టుకుంటుంది. టీనా శిల్పరాజ్ తన ఛార్మ్ తో ఆకట్టుకుంది. వెంకట్ ఆర్ శాకమూరి సినిమాటోగ్రఫీ పర్ఫెక్ట్ గా ఉంది. శేఖర్ చంద్ర, కళ్యాణ్ నాయక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద అసెట్. మొత్తానికి ట్రైలర్ మంచి అంచనాలను నెలకొల్పింది.