దిగ్గజ దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమాపై ఇంట్రస్టింగ్ అప్డేట్ వచ్చిది. ఈ మేరకు దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఫ్రాంఛైజీగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఓ ఇంటర్య్యూలో ఆయన వెల్లడించారు.
“మహేశ్ బాబు – రాజమౌళి ప్రాజెక్ట్ ప్రాంఛైజీగా రానుంది. ఈ సినిమా నుంచి సీక్వెల్స్ వస్తుంటాయి. ప్రస్తుతం పార్ట్1 స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాం.” ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘RRR’ తర్వాత రాజమౌళి తెరకెక్కించనున్న ప్రాజెక్ట్ ఇదే. యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా ఇది సిద్ధం కానుంది. అగ్ర తారాగణంతో భారీ బడ్జెట్ తో దీన్ని రూపొందించనున్నారు. పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ సైతం ఇందులో భాగం అవుతున్నట్లు వార్తలు వచ్చాయి.
మరోవైపు మహేశ్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక ఆయన జక్కన్న ప్రాజెక్ట్ కోసం సన్నద్ధమయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.