ముంచుకొస్తున్న అప్పుల సునామీ - Tolivelugu

ముంచుకొస్తున్న అప్పుల సునామీ

యండమూరి వీరేంద్రనాథ్, ప్రముఖ రచయిత

 

మన రాష్ట్ర వ్యవస్థ ఇలా తయారవటానికి అంకురార్పణ 20 ఏళ్ల క్రితం ప్రారంభం అయింది…! రాబోయే ప్రమాదాన్ని తెలుసుకోకుండా… కాంగ్రెస్ గానీ, టి.డి.పి. గానీ, ప్రస్తుత ప్రభుత్వం గానీ పోటీ పడి ఈ విధానాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఇది ఇతర రాష్ట్రాలకు పాకింది”.

“సంపన్నుల నుంచి పన్నులు వసూలు చేసి, బీదలను పైకి తీసుకురావటం సోషలిజం. కానీ సంపన్నులు “డబ్బు పెంచుకోవటానికి ‘ఉత్పత్తి’ అవసరం లేదన్న” విషయం తెలుసుకున్నారు. ఉత్పాదన తగ్గించి, ‘సంపద సృష్టించటం’ మానేశారు. I have already explained this concept of real estate, money laundering. దాంతో పన్నుల రాబడి తగ్గిపోతోంది. మరోవైపు, బీదలు పైకి రావటానికి బదులు ఉచిత చదువు, వైద్యం, బియ్యం, కరెంటు… అంతా ఉ..చి..తo గా పొందటానికి అలవాటు పడుతున్నారు. ఇంకో దశాబ్దం అయ్యేసరికి 95 శాతం ప్రజలు పని పూర్తిగా మానేసి, ప్రభుత్వం పై ఆధారపడతారు. వారినీ తప్పు పట్టలేం. ఉత్పాదన లేనప్పుడు, ఇసుక దొరకనప్పుడు, కొత్త పరిశ్రమలు రానప్పుడు పనులు ఎక్కడ ఉంటాయి? సరే. సోషలిజం సంగతి పక్కన పెడదాం. మీకు తెలుసా? Our state is first to “cross” the FRBM… Fiscal Responsibility and Budget Management Discipline limit of 3.5. But it has no option to survive..! ఆర్ధిక క్రమశిక్షణలో అధమ స్థానం ఇది.

 

మన ఆదాయం 55 వేల కోట్లు అయితే ఉచిత వరాలు 50 వేల కోట్లు. వడ్డీ కట్టటానికి అప్పు చేస్తున్న స్థితి…! మరో వైపు ప్రభుత్వం కాంట్రాక్టర్లకీ, ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకీ, ఇంజనీరింగ్ కాలేజీలు మొదలైనవాటికీ ఏడాది కాలంగా దాదాపు 25వేల కోట్లు బాకీపడి ఇవ్వటం లేదు. ఇదిలా ఉండగా, పెన్షన్లు 1000 శాతం పెరిగాయి. The govt promised a budget of 2.2 lakh crore with estimated new borrowing of 50,000 crore, a huge wage bill of 50,000 crores and interest payments of 25000 crore. ఇక కొత్త పరిశ్రమలకి పెట్టుబడి ఎక్కడుంది? దాంతో వచ్చే పదేళ్ళలో నిరుద్యోగం మరింత పెరిగిపోతుంది. అప్పటికే దివాళా తీసి ఉన్న రాష్ట్రానికి కేంద్రం సాయం చెయ్యదు. అధికారం నిలుపుకోవటానికి పార్టీలు వేసే మెతుకలకి బలి అయ్యేది మనమే. ప్రస్తుతం ప్రమాదం చాప క్రింద నీరులా నెమ్మదిగా వస్తోంది. మరో అయిదేళ్ళకి ఇది సునామీ అవుతుంది. మళ్ళీ చెపుతున్నాను. ఇది రాజకీయ ఉపన్యాసం కాదు. కేవలం ఆర్థిక రంగానికి సంబంధించింది.

Share on facebook
Share on twitter
Share on whatsapp