ఒక తప్పుడు పోస్ట్ ఓ వ్యక్తిని కేసులో ఇరుక్కునేలా చేసింది. అయితే అతను రాంగ్ పోస్ట్ చేసింది ఎంపీ పై. ఎంపీ బండి సంజయ్ అతని బామ్మర్ది శ్రీనివాస్ తో కలిసి భూ కబ్జాకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. సచిన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీని పై స్పందించిన బీజేసీ పార్లమెంట్ కన్వీనర్ బోయిన్ పల్లి ప్రవీణ్ రావ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సచిన్ తన ట్విట్టర్ లో ఎంపీ బండి సంజయ్, అతని బామ్మర్ది కలిసి రేకుర్తి శివారులోని భూమిని కబ్జా చేసినట్టు నిరాధార ఆరోపణలు చేశారని ఫిర్యాదులో ప్రవీణ్ రావ్ పేర్కొన్నారు. ఇది బండి సంజయ్ పరువుకు భంగం వాటిల్లేలా చేయడమే కాకుండా, బీజేపీ కార్యకర్తలమైన తమను కూడా అవమానించే విధంగా ఉందన్నారు.
ఫిర్యాదుదారుడు ప్రవీణ్ రావ్.. సచిన్ ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ ను కంప్లైట్ తో జత చేశారు.
ఎంపీ బండి సంజయ్ పై నిరాధార ఆరోపణలు చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టడంతో పాటు బీజేపీ కార్యకర్తల పరువుకు నష్టం కలిగేలా వ్యవహరించిన సచిన్.కె రెడ్డి పై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.