సేంద్రీయ, పురాతన వ్యవసాయ పద్దతుల ప్రాముఖ్యతను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ సోమవారం వివరించారు. ఆ వ్యవసాయ పద్ధతుల పరిజ్ఞానాన్ని పరిశీలించకుండా అశాస్త్రీయమని తిరస్కరించడం సరికాదని ఆయన అన్నారు.
మహారాష్ట్ర యానిమల్ అండ్ ఫిషరీ సైన్సెస్ యూనివర్సిటీ నాగపూర్, నేషనల్ అకాడమీ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ లు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
దేశంలోని వ్యవసాయ, పశుసంవర్ధక విధానాలు చాలా పురాతనమైనవని ఆయన పేర్కొన్నారు. ఆధునిక సైన్స్ కు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నారు. కానీ పురాతన జ్ఞానం, పద్దతులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు.
పరిశోధన, స్థానిక జ్ఞానాన్ని ఉపయోగించడంలో అవకాశాలపై దృష్టిపెట్టాలన్నారు. స్థానిక పరిజ్ఞానాన్ని అశాస్త్రీయంగా పేర్కొంటూ తిరస్కరించడం సరికాదన్నారు. మొదట దానిపై పరిశీలనలు చేయాలని, ఆ తర్వాత ఆ పరిజ్ఞానం సరైనది కాదనిపిస్తే వాటిని తిరస్కరించవచ్చని అన్నారు.