WWF ఇండియా తన తన బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి కోడలు, అపోలో హస్పిటల్స్ ఎండి ఉపాసనను నియమించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పల్లెలు, చిన్న చిన్న గూడెల్లో వాతవారణ మార్పులు, పర్యావరణ విద్య, నీరు సహా దేశం ఎదుర్కొంటున్న పర్యావరణ అంశాల పరిరక్షణ కోసం WWFఇండియా పనిచేస్తుంది. ఇప్పుడీ లాభాపేక్ష లేని సంస్థలో ప్రభుత్వాలు, ఎన్జీవోలు, పాఠశాలు, విద్యార్థులు, కార్పోరేట్స్‌తో కలిసి ఉపాసన ఈ సంస్థలో పనిచేయనుంది.