మనం ఏదైనా తెలియని విషయం గురించి తెలుసుకోవాలంటే గూగుల్‌లో సెర్చ్ చేసి తెలుసుకుంటాం. అదే విజువల్‌గా చూసి తెలుసుకోవాలంటే యూట్యూబ్‌లో చూసి తెలుసుకుంటాం. ఇటీవల కాలంలో అయితే, యూట్యూబ్ చూసి చేసే ప్రయోగాలు చాలా ఎక్కువ అయ్యాయి. వంటల దగ్గరి నుంచి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నారు నెటిజన్లు. కొన్ని హిట్ అయితే.. మరికొన్ని ఫెయిల్ అవుతుంటాయి. అయితే, ఓ వ్యక్తి యూట్యూబ్‌లో చూసి ఏకంగా ఎక్స్‌రే మిషన్‌నే తయారు చేశాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
యూట్యూబర్ విల్ ఉస్మాన్ అనారోగ్యంతో దవాఖానలో చేరాడు. రెండురోజులు దవాఖానలో ఉన్నందుకు రూ. 52.63 లక్షల బిల్లు వేశారు హాస్పిటల్ యాజమాన్యం. ఎక్స్‌రే, యాంటీబయాటిక్స్‌తో కూడిన చికిత్సకు ఈ మొత్తం వసూలు చేశారు. అందులో ఎక్స్‌రేకు చాలా పెద్ద మొత్తంలో వసూలు చేశారు.
ఎక్స్‌రేకు ఇంత ఖర్చవుతుందా.. అని ఆలోచనలో పడ్డాడు. తాను ఎక్స్‌ర్ యంత్రాన్ని తయారుచేస్తానని శపథం పూనాడు. ఇన్సూరెన్స్ పోనూ రూ. 2,500 డాలర్లు చెల్లించాడు. దవాఖాన నుంచి ఇంటిరాగానే ఎక్స్‌రే యంత్రం తయారుచేయాలని నిశ్చయించుకున్నాడు. ఎక్స్‌రే యంత్రానికి సంబంధించి వివరాలు తెలుసుకున్నాడు. యూట్యూబ్‌లో వీడియోలు చూశాడు. ఫైనల్‌గా ఎక్స్‌రే మిషన్‌ను తయారుచేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.