చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మెదడు సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. దీనికి సంబంధించి కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్నారు. అయితే ఇప్పటి వరకు దీన్ని చైనా ప్రభుత్వం ధృవీకరించలేదు.
ఆయన చైనీయుల సాంప్రదాయ వైద్య చికిత్సను తీసుకుంటున్నట్టు పమాచారం. సర్జరీకి బదులుగా ఆయన ఈ చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ చికిత్స అందిస్తే మెదడులోని రక్త నాళాలు మెత్తబడుతాయని, తద్వారా వ్యాధి తగ్గే అవకాశాలు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.
మెదడులోని నరాల్లో వాపు రావడంతో చాలా కాలం నుంచి విదేశీ నేతలను ఆయన కలవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా విజృంభణ ప్రారంభమైనప్పటి నుంచి బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ వరకు ఆయన అన్ని సమావేశాలకు దూరంగానే ఉంటున్నారు.
2019లో ఇటలీ పర్యటనకు వెళ్లిన సమయంలోనూ ఆయన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన సమయంలో నడిచేందుకు ఇబ్బందిపడుతూ కనిపించారు. కుర్చీలో కూర్చోవడానికి కూడా ఆయన ఇతరుల సాయం తీసుకున్నారు.