కొత్త ఫోన్ కొంటే… ఆ ఫోన్ బాక్స్ లో ఫోన్, చార్జర్ తో పాటు యూజర్ గైడ్ వస్తుంది. గతంలో హియర్ ఫోన్స్ కూడా వచ్చేవి. కానీ ఇప్పుడు కొన్ని కంపెనీలు మాత్రమే ఇస్తుండగా… కొన్ని కంపెనీలు ఇప్పటికే టాటా చెప్పేశాయి. తాజాగా షియోమీ గ్రూప్ కు చెందిన ఎంఐ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
పర్యావరణహితం కోసం యాపిల్ సంస్థ తీసుకున్న నిర్ణయానికే తాము కూడా మద్ధతిస్తున్నామని, యాపిల్ సంస్థ ఇక నుండి కొనుగోలు చేసే కొత్త ఫోన్లతో పాటు చార్జర్ ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని తాము బలపరుస్తున్నట్లు ప్రకటించింది. షియోమీ కొత్తగా లాంచ్ చేయబోయే ఎంఐ 11 ఫోన్స్ బాక్స్ లో చార్జర్ ఇవ్వటం లేదని ఈ చైనా కంపెనీ ప్రకటించింది.
ఎంఐ 11ను డిసెంబర్ 28న చైనాలో లాంచ్ చేయబోతున్నారు. ఈ కొత్త ఫోన్ మూడు కెమెరాలతో 108మెగాపిక్సెల్ లెన్స్ తో రానుంది. సెకండ్ కెమెరాలో అల్ట్రా వైడ్ లెన్స్ ఉండనుండగా, మూడో కెమెరా 30x వరకు జూమ్ చేయనుంది.