సినిమా టికెట్స్ ధరల పై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు కలిశారు. వీరితో పాటు ఆ భేటీలో పోసాని, ఆలీ కూడా ఉన్నారు. అయితే భేటీ అనంతరం మీడియాతో చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి మాట్లాడారు. కానీ మాత్రం పోసాని మాత్రం కనిపించలేదు. దీనికి కారణం ఏంటి అని నెటిజన్లు సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.
గతంలో పవన్ పై రాజకీయ, వ్యక్తిగత విమర్శలు చేశారు పోసాని. దీంతో పవన్ అభిమానులు పోసాని కుటుంబ సభ్యులను దూషిస్తూ వ్యక్తిగత మెసేజ్‌లు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు.
అయితే పవన్ తన అభిమానులను నియంత్రించుకోవాలని, లేదంటే తాను కూడా అదే స్థాయిలో వ్యక్తిగత విమర్శలకు దిగుతానని కూడా అన్నారు. అనంతరం పోసాని ఇంటిపై పవన్ అభిమానులు దాడికి తెగబడ్డారు.
ఈ నేపథ్యంలో భేటీ కి వచ్చిన చిరు బృందం తో సంబంధం లేకుండా ఆయన జగన్ ను కలిసినట్లు తెలుస్తుంది. అందుకే మీడియా ముందుకు కూడా వారితో కలిసి రాలేదట.