తెలంగాణలోని యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహాస్వామి దేవాలయాన్ని మూసివేస్తూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యాసంస్థలకు సెలవు ఇవ్వటంతో భక్తుల తాకిడి పెరిగే ప్రమాదం ఉండటంతో పాటు కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు నివారణ చర్యల్లో భాగంగా మార్చి 31 వరకు యాదాద్రి టెంపుల్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. స్వామి వారికి చేసే అన్ని ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత కళ్యాణాలు, వత్రాలన్నీ రద్దయ్యాయి.
అయితే, లఘు దర్శనానికి మాత్రం అనుమతి ఉందని ఆలయ ఈవో ప్రకటించారు.