టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై యాదవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యాదవ, కురుమలను అవమానించేలా రేవంత్ రెడ్డి మాట్లాడారని.. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చెపట్టారు. రేవంత్ రెడ్డికి వారు విధించిన డెడ్ లైన్ ముగియనుండటంతో.. నిరసనను ఉధృతం చేశారు.
రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని గురువారం గాంధీ భవన్ ముట్టడికి యాదవ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. దున్నపోతును తీసుకుని గాంధీభవన్ ముట్టడికి యత్నించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
యాదవ జేఏసీ నేతలు ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్రిక్తతకు దారి తీయకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి మాత్రం తాను ఏం తప్పుగా మాట్లాడలేదని.. క్షమాపణ చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. రేవంత్ కు మద్దతుగా అంజనీ కుమార్ నిలిచారు.
రేవంత్ రెడ్డి యాదవ్ ల ప్రస్తావన తీయలేదని అన్నారు. కేవలం తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించే విమర్శలు చేశారని తెలిపారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయపరంగా మరింత హీటెక్కుతోంది.