గొర్రెలిప్పిస్తామని ఆశ చెప్పి హుజురాబాద్ నియోజకవర్గంలోని 60మంది గొర్రెల కుర్మలను గుంటూరు తీసుకెళ్లారు అధికారులు. గుంటూరు జిల్లా మాచర్ల మండలంకు తీసుకెళ్లి అక్కడే వారిని అధికారులు విడిచిపెట్టారు. అధికారులు ఫోన్ స్విచ్చాఫ్ చేయటంతో ఆ 60మంది తినడానికి కూడా తిండి లేక అక్కడే ఇబ్బంది పడుతున్నారు.
వీరంతా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వలబాపూర్ గ్రామంకు చెందిన వారిగా తెలుస్తోంది.
గొర్రెలిప్పిస్తామని చెప్పి… అధికారులు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని వారి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. తమ వారిని సేఫ్ గా ఇంటికి చేర్చాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.