కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నేత యడ్యూరప్ప ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కు తృటిలో ప్రమాదం తప్పింది. సోమవారం కాల్ బుర్గి లో హెలికాఫ్టర్ లాండింగ్ అవుతుండగా హెలిపాడ్ వద్ద అక్కడి ప్లాస్టిక్ షీట్స్, చెత్త, వ్యర్థాలు ఒక్కసారిగా గాల్లోకి లేచాయి.
దీంతో పైలట్ హెలికాఫ్టర్ ను దింపలేకపోయాడు. విపరీతమైన దుమ్ము, ధూళి కారణంగా ఆయనకు ముందు ఏమున్నదీ కనిపించలేదు. దీంతో మళ్ళీ వెంటనే హెలికాఫ్టర్ ని అక్కడే పైన కొద్దిసేపు తిప్పాడు.
ఇంతలో సెక్యూరిటీ దళాలు హుటాహుటిన వచ్చి హెలిపాడ్ గ్రౌండ్ ని క్లియర్ చేశారు. అనంతరం పైలట్ సురక్షితంగా హెలికాఫ్టర్ ని కిందికి దింపాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చివరకు ఇది సేఫ్ గా ల్యాండ్ అయిందని, కాల్ బుర్గి ఎస్పీ ఇషా పంత్ తెలిపారు. ఈ ఉదంతంలో అధికారుల నిర్లక్ష్యం ఏదైనా ఉందా అన్న విషయమై ఆరా తీస్తున్నామని ఆయన చెప్పారు. తమ పార్టీ చేబట్టిన జన సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు యడ్యూరప్ప ఈ టౌన్ కి చేరుకున్నారు.