బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన అందమైన ఫోటోలు, షూటింగ్‌లకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ నేపథ్యంలో తను ఇటీవల నటించిన ‘దస్వీ’ చిత్రం నుంచి ఓ ఫోటోను షేర్ చేసింది.
‘దస్వీ’ చిత్రంలో యామీ గౌతమ్ జ్యోతి దేస్వాల్ అనే పోలీస్ అధికారిణిగా నటించింది. అయితే, సినిమా షూటింగ్ సమయం నాటి ఫోటోను ‘దస్వీ త్రో బ్యాక్’ అంటూ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది యామీ. ఈ ఫోటోలో పోలీస్ యూనిఫాంలో మేకప్ ఆర్టిస్టుల మధ్య రెడీ అవుతూ కనిపించింది. ఇక ‘జ్యోతి దేస్వాల్ ఇన్ ది మేకింగ్ #దస్వీ’ ట్యాగ్ ఇచ్చింది.
అంతేకాదు, ‘దస్వీ’ తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన చిత్రమని యామీ తెలిపింది. ఈ సినిమా కోసం తాను కొన్ని డాక్యుమెంటరీలను, నిజ జీవితంలోని మహిళా పోలీసుల కథనాల గురించి తెలుసుకున్నట్లు వివరించింది. తనకు ‘దస్వీ’ షూటింగ్ అనుభవం మరింత ప్రత్యేకంగా.. చిరస్మరణీయంగా మారాయని తెలిపింది.
‘దస్వీ’.. తుషార్ జలోట దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న జియో సినిమా, నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చదువు ప్రాముఖ్యతను చాటి చెప్పేలా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్, నిమ్రత్ కౌర్ కీలకపాత్రలు పోషించారు. ఇక సినిమా మిక్సడ్ టాక్ తెచ్చుకుంది.