ఇటీవల కాలంలో సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలెబ్రిటీలు, హీరోలు, హీరోయిన్‌లు, అధికారులు ఇలా చాలా మంది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని నెట్టింట పోస్ట్ చేస్తూ తమ ఫాలోవర్స్‌తో పంచుకుంటుంటారు. అయితే, కొంతమంది హ్యాకర్లు వీరి అకౌంట్లను హ్యాక్ చేసి డబ్బులు అడగడమో, పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టడమో, తప్పుడు సమాచారం ప్రచారం చేయడమో చేస్తుంటారు. ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీలు, అధికారులు ఈ సమస్యను ఎదుర్కొన్నారు. ఈ మధ్య కాలంలో ఇది సాధారణ విషయయే అయినప్పటికీ ఇలాంటి వాటి పట్ల అప్రమత్తత లేకపోతే ఎలాంటి నష్టమైన జరగొచ్చు. అందుకే సెలెబ్రిటీలు జాగ్రత్తగా తమ ఫాలోవర్స్‌ను వారు అప్రమత్తం చేస్తుంటారు. తాజాగా, మరో బాలీవుడ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు.
బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ని యాక్సెస్ చేయలేకపోపోతున్నానని ప్రకటించింది. ఈ విషయాన్ని తన అభిమానులు, ఫాలోవర్‌లకు ఏప్రిల్ 3న తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. తన ఖాతా బహుశా హ్యాక్ అయ్యిందని, ఆ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఏదైనా అసాధారణ కార్యకలాపం జరిగితే జాగ్రత్తగా ఉండాలని కోరింది.
“హాయ్, నేను నిన్నటి నుండి నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను యాక్సెస్ చేయలేకపోతున్నాను. బహుశా ఇది హ్యాక్ చేయబడి ఉండవచ్చునని మీకు తెలియజేయడానికి ఈ పోస్ట్ చేస్తున్నాను. మేము వీలైనంత త్వరగా దాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈలోగా నా ఖాతా ద్వారా ఏదైనా అసాధారణ కార్యకలాపం ఉంటే, దయచేసి దాని గురించి తెలుసుకోండి. ధన్యవాదాలు! ” అంటూ పోస్ట్ చేసింది. ఇక యామీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 15.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
యామీ గౌతమ్ సినిమాల విషయానికొస్తే.. తెలుగులో ‘నువ్విలా’తో పాటు మరో రెండు మూడు సినిమాలు చేసిన యామి గౌతమ్ హిందీలో వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో బిజీ అయిపొయింది. త్వరలో ఆమె ‘దాస్వీ’లో కనిపించనుంది. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, నిమ్రత్ కౌర్‌లతో నటి స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనుంది.
Hi,
This is to inform you all that I've been unable to access my Instagram account since yesterday, it's probably hacked. We're trying to recover it as soon as possible. Meanwhile, if there is any unusual activity through my account, please be aware of it.
Thank you!
— Yami Gautam Dhar (@yamigautam) April 3, 2022
Advertisements