హిమాలయ కొండల్లో నుండి జాలువారి, స్వచ్ఛమైన నీటితో పారే యమునా నది కాలుష్యం తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా దేశరాజధాని పరిసర ప్రాంతాల్లో యమునా నదిని చూస్తే… మరీ ఇంత ఘోరమా అని తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. ఎంతో పవిత్రంగా భావించే జీవనది అయిన యమునా… ఇప్పుడు పారిశ్రామిక వ్యర్ధజలాల నురగతో నిండిపోయింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నది పరిస్థితికి ఈ ఫోటోలు అద్దం పడుతున్నాయి.
ఎంతో పవిత్రంగా భావించి, మరణించిన తమ కుటుంబ సభ్యులకు… బంధువుల ఆత్మ శాంతి కోసం యమునా తీరాన పూజలు చేయటం అనవాయితీగా వస్తుంది.