విజయవాడ : జగన్ ఆదేశాలనే సత్తిబాబు పాటిస్తున్నారని మాజీ ఆర్థికమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఏపీలో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి హైదరాబాద్ ఎకానమీ పెంచడమే జగన్ టార్గెట్ అని యనమల మండిపడ్డారు. టీఆర్ఎస్ రుణం తీర్చుకోవడానికి ఏపీ అభివృద్ధికి గండికొట్టడం దారుణమని దుయ్యబట్టారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యానికి జగన్ రివర్స్ రూలింగ్ పాలనే కారణమని అన్నారు. ఏపీ సర్వనాశనం కావాలన్నదే జగన్ స్వప్నమని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల నేర చరిత్ర చూసి రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని అన్నారు.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » జగన్ శాసించారు !! సత్తిబాబు పాటించారు..