విజయవాడ: వైసిీపిీ ప్రతి నేరాన్ని ప్రజల ముందు పెడతామని శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు చెప్పారు. వంద రోజుల వైసీపీ వైఫల్యాలపై వాస్తవ పత్రం ప్రకటిస్తున్నామని ఆయన చెప్పారు. ‘వైసీపీ వైఫల్యాలకు కళ్లెదుటే సాక్ష్యాలు ఉన్నాయి. రుజువులతో సహా ఫొటో ఎగ్జిబిషన్ కూడా పెడతాం..’ అని యనమల వ్యాఖ్యానించారు. నిన్న పంపిణీ చేసిన బియ్యమే తాజా రుజువు అని చెప్పారు. ముందు ‘సన్నబియ్యం’ అని చెప్పి తరువాత నాణ్యమైన బియ్యం అని మాట మార్చి చివరకి ‘బియ్యం చెక్కలు’ ఇచ్చారని ఎద్దేవాచేశారు. శ్రీకాకుళం జిల్లా 8 మండలాల్లో ‘చెక్క బియ్యం’ సరఫరా చేశారని, బియ్యం చెక్కలు తీసుకున్న పేదల వ్యాఖ్యలే ప్రత్యక్ష రుజువని యనమల చెప్పారు. వైసీపీ నేతలకు యనమల వేసిన ప్రశ్నలు ఇవీ…
- మీ నిర్వాకాలకు ఏ సాక్ష్యం ఏం కావాలి..?
- మీ ముడుపుల కోసం బియ్యం చెక్కలు పేదలకు పంపిణి చేస్తారా..?
- పేదలకిచ్చిన ‘చెక్క బియ్యం’ సంగతేంటి..?
- ‘బియ్యం చెక్కలపై సమాధానం ఏమిటి..?
- రూ.250 మాత్రమే పించన్ పెంచడం మాట తప్పడానికి మరో సాక్ష్యం..
- మీ మోసానికి వృద్దులకిచ్చే రూ.2,250 పించనే ఇంకో సాక్ష్యం
- పించన్ రూ.3వేలు చేస్తామన్నారు, రూ.2,250 మాత్రమే ఇస్తున్నారు.
- వృద్దులు, అనాధల పించన్ సంగతేంటి..?
- రూ.250మాత్రమే పెంచి 4ఏళ్ల తర్వాత రూ.3 వేలు ఇస్తారా..?
- పరిశ్రమలు ఎక్కడికీ పోలేదని బొత్స అనడం హాస్యాస్పదం.
- వోక్స్ వ్యాగన్ ఏమయ్యింది..? ఎక్కడికి పోయింది, ఎందుకు పోయింది..?
- విశాఖకు వచ్చే రూ.1400కోట్ల పెట్టుబడులు, 3వేల ఉద్యోగాలు పోగొట్టింది మీరు కాదా..?
- ఏవీ తరలిపోలేదని మంత్రి బొత్స ఎలా అంటారు..
- రూ.11కోట్లు పోనాయి, నానేటి సేత్తా అన్నదెవరు..?
- ఆ రోజే కాదు, ఈ 100 రోజుల్లో పరిశ్రమలు పోలేదా..?
- కియా ఆగ్జిలరీ 17 యూనిట్ల పరిస్థితి ఏంటి..?
- అమరావతి నుంచి ఎన్ని పెట్టుబడులు తరలిపోయాయి..?
- మోహన్ దాస్ పాయ్, సుబ్రమణ్యన్ వ్యాఖ్యలపై ఏమంటారు..?
- టిడిపి ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్యేలపై పాత కేసులు తవ్వడం ఏమిటి..?
- క్లోజ్ అయిన కేసులు ఎలా రీఓపెన్ చేస్తారు..?
- ఆ రోజే వాటిపై ఎందుకని కోర్టుకు వెళ్లలేదు..?
- ఆ రోజే ఎందుకని కేసులు పెట్టలేదు..?వైసిపి నేతలపై కేసులు కూడా రీఓపెన్ చేయండి
- అఫిడవిట్ లలో ఉన్న కేసులన్నీ రీఓపెన్ చేయండి..
- నేర చరిత్ర ఉన్న వైసిపి నేతలందరిపై కేసులు రీఓపెన్ చేస్తారా..?
- మా పునాదులు కదిపే శక్తి ఎవరికీ లేదు, మీకు అసలే లేదు.
- చాలామంది ప్రయత్నించి చతికిలపడ్డారు.
- 100 రోజుల్లోనే కదిలిన మీ పునాదుల సంగతి ముందు చూసుకోండి.
- ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చండి.
- టిడిపితో పోటీబడి రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టండి
- అంతే తప్ప పేదలను రోడ్లపైకి లాక్కండి..
- కక్ష సాధింపు చర్యలు మానుకోండి..