రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కే జి ఎఫ్ చాప్టర్2. గతంలో వచ్చిన కేజిఎఫ్ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు.
అయితే ఈ చిత్రం ఏప్రిల్ 14న భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉండగా నేడు యశ్ పుట్టిన రోజు ఈ సందర్భంగా మేకర్స్ అదిరిపోయే పోస్టర్ ను రిలీజ్ చేశారు. డేంజర్ బోర్డ్ ముందు పెట్టి దాని వెనుక యశ్ నిలుచున్నాడు. ఈ పోస్టర్ బట్టి చెప్పొచ్చు యశ్ పాత్ర ఎంత డేంజరెస్ గా ఉంటుందో. ఇక ఇప్పటికే సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.