రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ కొనసాగుతోంది. ప్రధాని మోడీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఇతర ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఇది ఇలా ఉండగా మోడీ సర్కార్ పై విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఫైర్ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రలోభాలకు బీజేపీ తెరలేపిందన్నారు. ఈ ఎన్నికల్లో ధన ప్రవాహంతో పాటు ప్రభుత్వ ఏజెన్సీలను దుర్వినియోగం చేయడంపై బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు.
దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించే క్రమంలో ప్రజాప్రతినిధులంతా తమ విచక్షణను ఉపయోగించి ఓట్లు వేయాలని ఆయన కోరారు. రాష్ట్రపతి ఎన్నికలు చాలా కీలకమైనవని అన్నారు.
దేశ ప్రజాస్వామ్య ప్రస్ధానాన్ని ఈ ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తాయని ఆయన పేర్కొన్నారు. అందువల్ల విచక్షణతో ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలను మోడీ సర్కార్ అప్రజాస్వామిక పద్దతుల్లో కూల్చివేస్తోందని ధ్వజమెత్తారు.