ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు వైపీపీ ప్రభుత్వం దౌర్జాన్యాలకు, దాడులకు పాల్పడడం పిరికి చర్యగా పేర్కొన్నారు. వైసీపీ మనుషులు పోలీసుల సమక్షంలో ఇలాంటి అమానుష చర్యలకు పాల్పడడం బీజేపీ ఖండిస్తోందన్నారు. బీజేపీ నేత సత్యకుమార్ పై దాడి ఘటనపై ఆయన సీరియస్ అయ్యారు.
రైతుల ఉద్యమానికి మద్దతుగా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వెళ్ళి వస్తున్న క్రమంలో ప్లాన్ ప్రకారమే ఆయన పై దాడి చేశారని ఆయన మండిపడ్డారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఆయన పై దాడికి పాల్పడి ఆయనతో పాటు ఉన్న సురేష్, యాదవ్ లను చితక్కొట్టారని ఆయన ఫైర్ అయ్యారు.
వైసీపీ మనుషులు పోలీసుల సమక్షంలో ఇలాంటి అమానుష చర్యలను పాల్పడడం అప్రజాస్వామికమన్నారు ఆయన. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని సోమువీర్రాజు హెచ్చరించారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు.
ఎంపీ చేత కాని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ దాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ చంద్రబాబు డైరెక్షన్ అని అనడం దారుణమన్నారు. రాజధాని విషయంలో బీజేపీ కట్టుబడి ఉందన్నారు. మూడు రాజధానులు అని చెప్పి ఏం సాధించారని ఆయన నిలదీశారు.