లాక్ డౌన్ కారణంగా చాలా నెలలు తరువాత ఏపీ ఆర్టీసీ బస్సులు రోడ్డు మీదకు వచ్చాయి. కానీ ఆ బస్సు లను సైతం వదలకుండా రంగులు వేసేశారని ఆరోపించారు టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, కిడారి శ్రవణ్. మద్దెలపాలెం డిపోకు చెందిన బస్సుకు గతంలో ఉన్న రంగులు మార్చారని అయ్యపాత్రుడు ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులకు వైసీపీ రంగులు వేయడమేంటని విమర్శలు గుప్పించారు.
ఇప్పటికే ప్రభుత్వ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేసి వైసీపీ పార్టీ నాయకులు విమర్శలు పాలయిన సంగతి తెలిసిందే. కోర్టులు సైతం రంగులు తొలగించాలని ఆదేశించడంతో, మళ్లీ రంగులు మారుస్తూ ఐఏఎస్‌లతో కమిటీ వేసింది. అదనంగా మరో రంగు మాత్రమే చేర్చించిందని ఆరోపిస్తూ మళ్లీ పిటిషన్లు దాఖలు అయ్యాయి. ప్రస్తుతం తీర్పును కోర్టు రిజర్వుల్లో పెట్టింది. అయితే టీడీపీ అధికారంఓ ఉన్నప్పుడు ఆర్టీసీ బస్సులకు పసుపు రంగు వేశారని, పల్లె వెలుగు పేరు మారుస్తూ తెలుగు వెలుగు అని పెట్టారని వైసీపీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.